700 రుపాయలకే బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్‌: రిలయన్స్ జియో ప్రకటన

బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురుచూసిన గిగాఫైబర్ సేవలపై స్పష్టత ఇచ్చింది రిలయెన్స్ జియో. సెప్టెంబర్ 5వ తేదీన జియో గిగాఫైబర్ సేవలు కమర్షియల్ బేసిస్‌తో ప్రారంభం అవుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. రిలయెన్స్ నుంచి జియో టెలికామ్ సేవలు సంచలనంగా ఎంట్రీ ఇచ్చిన క్రమంలోనే బ్రాడ్‌బ్యాండ్ సెక్టార్‌లో గిగాఫైబర్ మరో సంచలనంగా ఎంట్రీ ఇవ్వనుంది. 2018 సెప్టెంబర్ లో గిగాఫైబర్ సర్వీస్‌ను ప్రకటించిన రిలయెన్స్ జియో.


బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్‌ను ఒకే ప్యాకేజ్‌లో అం


దించడమే లక్ష్యంగా మార్కెట్లోకి వస్తుంది. గిగాఫైబర్ కోసం గతేడాదే రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. 1600 పట్టణాల నుంచి 15 మిలియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఇప్పటికే ముకేష్ అంబానీ వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా గిగాఫైబర్ సేవలను ఇప్పటికే అందిస్తోంది రిలయెన్స్ జియో. 20 మిలియన్ ఇళ్లకు గిగాఫైబర్ సేవలు అందించేలా ప్రణాళికలు వేస్తుంది


రిలయెన్స్ జియో గిగాఫైబర్ కనెక్షన్ తీసుకున్నవారికి 1 జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. అంటే సెకన్‌కు 1 జీబీ స్పీడ్‌తో డేటా వస్తుందనమాట. దీంతో పాటు ల్యాండ్‌లైన్ ఫోన్, జియో 4కే సెట్ టాప్ బాక్స్ సెటాప్ బాక్స్ ఉచితంగా లభిస్తాయి. అల్ట్రా హై డెఫినేషన్ ఎంటర్‌టైన్‌మెంట్, మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ గిగాఫైబర్‌ ఇస్తుంది


ఇప్పటి వరకు ఇంటర్నెట్, ల్యాండ్​లైన్​ సేవలు ఒకే కనెక్షన్​పై అందుబాటులో ఉన్నా.. టీవీ కోసం మరో కనెక్షన్​ తీసుకోవలసి ఉండేది. అయితే జియో గిగా ఫైబర్ అందుబాటులోకి వస్తే ఒకే కనెక్షన్​తో మూడు సేవలు లభిస్తాయి. జియో 'ట్రిపుల్ ప్లే' ప్లాన్​లోని వినియోగదారులు డీటీహెచ్, బ్రాడ్​బ్యాండ్​, ల్యాండ్​లైన్ సేవలను పొందవచ్చు. అలాగే ఫస్ట్ డే ఫస్ట్ షో దియేటర్ లో విడుదలయ్యే సినిమాను టీవీలోనే చూసే అవకాశం కల్పించబోతుంది జియో. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం కాబోతుంది. ప్రీమియం జియో ఫైబర్‌ కస్టమర్లకు ఈ అవకాశం ఉంది. 'జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో'గా పిలిచే ఈ సేవలను 2020 మధ్యలో అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు కంపెనీ ప్రకటించింది.