బీజేపీ నేత ఏడాదిపాటు రేప్ చేశాడు.. పక్కా ఆధారాలున్నాయి: లా స్టూడెంట్



 





బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానందపై తన ఆశ్రమంలోని మహిళపై అత్యాచారాలకు పాల్పడుతున్నట్టు అక్కడ లా చదువుతోన్న విద్యార్థిని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ఆరోపణలు చేసిన తర్వాత కనిపించకుండా పోయిన విద్యార్థినిని యూపీ పోలీసులు రాజస్థాన్‌లో ఉన్నట్టు గుర్తించారు. అంతకు ముందు తన కుమార్తె మిస్సింగ్ వెనుక చిన్మయానంద హస్తం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. దీంతో, ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. బాధితురాలిని తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. కాగా, ఈ వ్యవహారం సోమవారం మరో మలుపు తిరిగింది.